Iran Travel Advisory | ఇరాన్ వెళ్లొద్దు.. భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Travel Advisory | భారత పౌరులు విమాన లేదా భూమార్గం ద్వారా ఇరాన్ వెళ్లవద్దని టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. భారత్, ఇరాన్‌ (Iran)ల మధ్య కొన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా, గతంలో జారీ చేసిన హెచ్చరికలకు కొనసాగింపుగా, భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత జాతీయులందరూ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ.. నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల ద్వారానే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిమిత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ భారత్​ (India) ఇరాన్‌కు ప్రయాణించవద్దని పౌరులకు సూచించింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ సలహా జారీ అయింది. విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కొనసాగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Iran Travel Advisory | సమన్వయం చేసుకోవాలి

ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు, కార్యాచరణ అనిశ్చితులు ఇరాన్‌కు, ఇరాన్ నుంచి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటూ, నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల ద్వారానే దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇరాన్​, అమెరికా (America) మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో ఇరాన్​లోని కొన్ని కీలక విమానాశ్రయాలు తెరుచుకుంటున్నాయి.

Iran Travel Advisory | ప్రయాణాలు ప్రారంభం

ఇరాన్​లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport), మెహ్రాబాద్ విమానాశ్రయంతో సహా ప్రధాన విమానాశ్రయాలు దేశీయ సేవలను గురువారం పునఃప్రారంభించాయి, పరిమిత అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా పునరుద్ధరించబడింది. మషద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు నేటి నుంచి నడవనున్నాయి. అయితే ఇరాన్​, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బలంగా లేకపోవడంతో భారత ప్రభుత్వం పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. సహాయం కోసం ప్రజలు +989128109115, +989128109109, +989128109102, +989932179359 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

ఇది కూడా చదవండి..: Trump India Remarks | భారత్‌ను నరకంతో పోలుస్తూ ట్రంప్ పోస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *