Kamareddy Land Dispute | కష్టపడి ప్లాట్​ కొనుక్కుంటే దర్జాగా కబ్జా చేశారు.. ఎస్పీకి మహిళ ఫిర్యాదు

నలబై ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ప్లాట్ కబ్జా కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Land Dispute | నలబై ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ప్లాట్ కబ్జా కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra)ను కలిసి న్యాయం చేయాలని కోరారు.

Kamareddy Land Dispute | కామారెడ్డి పట్టణంలో..

బాధితురాలు ఆశాభాను 40 ఏళ్ల క్రితం ముప్పారపు వెంకయ్య వద్ద విద్యానగర్​లో 200 చదరపు గజాలు తీసుకున్నారు. అయితే ఈ స్థలాన్ని 2008లో రవికిరణ్​, ప్రవీణ్ కుమార్ కబ్జా చేసి బోర్డు పాతారని తెలిసి అక్కడికి వెళ్లగా నిజంగానే ప్లాట్ కబ్జా చేశారని బాధితులు తెలిపారు. దీనిపై అప్పట్లో కోర్టుకు వెళ్లగా తమకు 2018లో అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ కట్టి ఇంటి పర్మిషన్ తీసుకున్నామన్నారు. అయితే మూడు రోజుల క్రితం తమ స్థలంలో రవికిరణ్​, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఫెన్సింగ్ చేస్తున్నారని తెలిసి వెళ్లగా అక్కడ వాళ్ల స్థలం అని బోర్డు పాతి ఉందన్నారు. ఆ బోర్డు తాము తొలగిస్తే తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పటికి మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దాంతో ఇవాళ ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేశామన్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Development Programs | రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *