అక్షరటుడే, బాన్సువాడ: Constable Raghu | విధి నిర్వహణలో ఉండగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కామారెడ్డి (Kamareddy) జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి (MLA Pocharam Srinivas Reddy) బుధవారం వినతిపత్రం సమర్పించింది.
Constable Raghu | గాంధారి పోలీస్స్టేషన్లో..
కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (Police Welfare Telangana) అధ్యక్షుడు కె. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కె.రఘు జూన్ 9న అనారోగ్య కారణాలతో మరణించడం పోలీస్ శాఖకు, ఆయన కుటుంబానికి తీరని లోటన్నారు. ఆయన మరణంతో కుటుంబానికి ఏర్పడిన ఆర్థిక, సామాజిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆయన భార్య రజనికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
Constable Raghu | రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
అనారోగ్య కారణాలతో మరణించిన రఘు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ మంజూరైంది. ఈ సందర్భంగా బుధవారం బాన్సువాడ పట్టణంలో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ప్రతినిధులు అందించిన రూ.50 లక్షల చెక్కును ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రఘు భార్య రజనికి అందజేశారు.
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఇన్సూరెన్స్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని, విధి నిర్వహణలో ఉన్న ప్రతి పోలీస్ ఉద్యోగి తన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన బీమా రక్షణ పొందడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మరణించిన కానిస్టేబుల్ రఘు కుటుంబానికి అండగా నిలుస్తూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందేలా సహకరించిన టాటా ఏఐఏ బృందానికి కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శంకర్, వినీత, ప్రణీత, సతీష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఫేస్బుక్ లైవ్లో హత్య.. నిందితుడి అరెస్ట్..!