Karthika Deepam | కార్తీక దీపం అంటుకుని యువతి మృతి

కార్తీక దీపం అంటుకొని ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన కూకట్​పల్లిలో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karthika Deepam | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కూకట్​పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కార్తీక దీపం అంటుకొని తీవ్రంగా గాయపడ్డ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు పీఎస్ పరిధిలోని అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో వెంకట సింధు(18) అనే యువతి నివాసం ఉంటోంది. ఆమె బొటిక్​ నిర్వహిస్తు జీవనం సాగిస్తోంది. అయితే కార్తీక మాసం సందర్భంగా ఆమె ఇంటి వద్ద దీపాలు వెలిగించారు. ఈ నెల 12న రాత్రి సమయంలో సింధు దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ఆమె చీరకు అంటుకుంది.

Karthika Deepam | ఆస్పత్రికి తరలించగా..

మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డ వెంటక సింధును కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Puppalaguda Land Dispute | అర్ధరాత్రి రోడ్డు వేసిన రియల్​ ఎస్టేట్​ సంస్థ.. అడ్డకున్న స్థానికుల అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *