Oct 13 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు..లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 13 Market Analysis | సౌదీ విమానాశ్రయంపై హూతీ తిరుగుబాటుదారుల దాడుల తర్వాత చమురు ధరలు (Crude oil) మళ్లీ బ్యారెల్ కు 105 డాలర్లు దాటాయి. దీంతోపాటు కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Oct 13 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.44 శాతం, ఎస్ అండ్ పీ 0.06 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.

Oct 13 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.75 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.38 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.98 శాతం పెరిగాయి.

Oct 13 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.10 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.36 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.53 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.42 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.02 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.93 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

TVS Family Dispute | టీవీఎస్‌ గ్రూప్‌లో ఆస్తుల చిచ్చు.. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు వివాదం ఏమిటి?

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 12వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 1,708 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 43 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,045 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 96 పైసలు బలపడి 95.78 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.34 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.45 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.20 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.73 నుంచి 1.14కు పెరిగింది.
  • విక్స్ 5.89 శాతం తగ్గి 14.37 వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *