అక్షరటుడే, కామారెడ్డి: Organ Donation in Telangana | ఓ వ్యాపారవేత్త బ్రెయిన్ డెడ్ కాగా, అవయవ దానంతో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది. కామారెడ్డిలో పట్టణంలోని రాజానగర్ నివాసి పవన్ కుమార్ జాజు (39) వృత్తిరీత్యా వ్యాపారవేత్త. కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్నాడు.
Organ Donation in Telangana | బ్రెయిన్ హేమరేజ్ కావడంతో..
పవన్ కుమార్ జాజుకు అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్ కావడంతో ఈనెల 7న కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ (Hyderabad)లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతటి విషాద సమయంలోనూ పవన్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో అతడి రెండు కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులను నలుగురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా జీవన్ దాన్ తెలంగాణ ఇన్ఛార్జి ప్రొఫెసర్ భూషణ్ రాజు మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నిర్ణయం స్ఫూర్తిదాయకమన్నారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అవసరమైన వారికి సేవలు అందించేందుకు జీవన్ దాన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ