అక్షరటుడే వెబ్డెస్క్: Anojan Sivarasa Death Sentence | దైవదూషణ ఆరోపణలతో సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొన్న శ్రీలంకకు ( Sri Lanka ) చెందిన హిందూ యువకుడు అనోజన్ శివరసకు ఊరట లభించింది. ఆయనకు విధించిన మరణశిక్షను సౌదీ సుప్రీంకోర్టు రద్దు చేసినట్లు శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Anojan Sivarasa Death Sentence | అనుచిత వ్యాఖ్యలు ..
కొన్ని నెలల క్రితం శ్రీలంకలో జరిగిన ఒక హిందూ యాత్ర సమయంలో, యాత్రికులను అనుసరిస్తున్న కుక్కను ఒక ముస్లిం వ్యక్తి తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆన్లైన్లో జరిగిన వాదనల సమయంలో ఒక యూజర్ హిందూ దేవీదేవతలపై అవమానకర రీతిలో పోస్ట్ చేశాడు. దానికి ప్రతిస్పందిస్తూ సౌదీలో ఉద్యోగం చేస్తున్న శివరస తమిళంలో ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కొద్దిసేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేసి క్షమాపణలు కోరినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో సౌదీలోని ఆయన యజమానికి చేరాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కోర్టు తీర్పులు.. ఈ కేసుకు సంబంధించి మొదట అల్-అహ్సా క్రిమినల్ కోర్టు శివరసకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. అయితే ప్రాసిక్యూటర్ల అప్పీల్తో సౌదీ అప్పీల్ కోర్టు దీనిని మరణశిక్షగా మార్చింది. ఈ తీర్పుతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Anojan Sivarasa Death Sentence | దౌత్య ప్రయత్నాలు..
శివరసను కాపాడేందుకు శ్రీలంక ప్రభుత్వం, దౌత్య వర్గాలు ముమ్మరంగా ప్రయత్నించాయి. అక్కడి తమిళ, ముస్లిం ఎంపీలు సౌదీ విదేశాంగ మంత్రికి లేఖలు రాయగా, మత పెద్దలు కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. సౌదీలోని శ్రీలంక రాయబారి జైలులో ఉన్న అనోజన్ను నేరుగా కలిసి ధైర్యం చెప్పారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయ నిపుణుల బృందాన్ని కూడా సౌదీకి పంపింది. ఈ నేపథ్యంలో స్పందించిన సౌదీ సుప్రీంకోర్టు మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన పూర్తిగా విడుదల కావడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ