Red Sandalwood Smuggling | ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్​

కడప పోలీసులు ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Red Sandalwood Smuggling | కడప పోలీసులు (Kadapa Police) ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. 1.984 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1.984 టన్నుల బరువున్న 70 దుంగలతో పాటు, మూడు వాహనాలు, 643 కార్టన్ల కాఫీ పొడిని స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ. 1.30 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ నాచికేత్ విశ్వనాథ్ తెలిపారు.

Red Sandalwood Smuggling | కాఫీ పొడి ప్యాకెట్ల కింద..

ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా కాఫీ పొడి ప్యాకెట్ల లోడు కింద ఎర్రచందనం దుంగలను దాచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లాలోని ఎస్.ఏ. కాశీనాయన మండలం, ఆకుల నారాయణపల్లె గ్రామం సమీపంలో వాహనాన్ని తనిఖీ చేసి, నిందితులను అరెస్ట్​ చేశారు. వారిలో ఏడుగురు తమిళనాడుకు చెందినవారు కాగా, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మరికొందరు అనుమానితులు ఇంకా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు గొడ్డళ్లు, రాళ్లతో పోలీసు సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: hyderabad vijayawada highway | హైదరాబాద్ – విజయవాడ హైవేకు మహర్దశ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *