RS Praveen Kumar | టీఆర్​ఎస్​ అంటే తెలంగాణ రేవంత్ సైన్యం : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

టీఆర్​ఎస్​ అంటే తెలంగాణ రేవంత్ సైన్యం అని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RS Praveen Kumar | తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీపై బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్​ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ లాగా టీఆర్​ఎస్​ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే అన్నారు. టీఆర్​ఎస్​ అంటే తెలంగాణ రేవంత్ సైన్యం అని విమర్శించారు.

టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత సిద్దిపేటలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ స్పందించారు. సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాకనే మల్లన్న సాగర్ కట్టారన్నారు. అక్కడ భూకంపం వస్తుందని, భూమిని ట్రీట్ చేసి కట్టాలని కవిత అంటున్నారని, అయినా భూమిని ట్రీట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

RS Praveen Kumar | ఆ రిపోర్టులు ఎక్కడివి

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాళ్లు ఇచ్చిన రిపోర్టులు కవిత చేతిలోకి ఎలా వచ్చాయి అని ప్రవీణ్​కుమార్​ ప్రశ్నించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు రిపోర్టులు కేవలం ముఖ్యమంత్రికే పంపుతారన్నారు. కవితకు రిపోర్టులు రేవంత్ రెడ్డి ఇస్తేనే వచ్చాయా అన్నారు. రేవంత్ రెడ్డే స్క్రిప్ట్ ఇచ్చి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టులు ఇచ్చి కవితను మాట్లాడమని చెప్పారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Gig Workers Policy | గిగ్​ వర్కర్స్​ పాలసీ ప్రారంభించిన రాహుల్ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *