Sep 30 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 30 Market Analysis | ద్రవ్యోల్బణం (Inflation), కార్మిక మార్కెట్ గణాంకాల విడుదలకు ముందు ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ పెరుగుతూనే ఉండడం, వడ్డీ రేట్ల పెంపుపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పెట్టుబడిదారులు విశ్లేషిస్తుండడంతో మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.

గత సెషన్‌లో అమెరికా (America) స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. లాభాల స్వీకరణతో క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడం సానుకూలాంశం.

Sep 30 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

వాల్‌స్ట్రీట్ వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి గణనీయంగా కోలుకున్నాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.09 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం నష్టంతో ముగిశాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.36 శాతం లాభంతో ఉంది.

Amala Paul comments | హీరోయిన్ల అభ్యంతరకర సీన్లపై అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పుడు అలాంటి పాత్రలు చేయనంటూ!

Sep 30 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.10 శాతం లాభంతో, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.53 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.45 శాతం నష్టంతో ముగిశాయి.

Sep 30 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.50 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.39 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.28 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.25 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.46 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Sep 30 Market Analysis | రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి..

కీలకమైన పదేళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ సైతం ఇంట్రాడేలో 5.29 శాతానికి పెరిగి 2007 జూన్ తర్వాత గరిష్ట స్థాయిని నమోదు చేసి ఆ తర్వాత కాస్త తగ్గి 5.23 శాతం వద్ద ఉంది. అలాగే 30 ఏళ్ల£ అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్ 5.62 శాతానికి చేరింది. ఇది 2002 జూన్ తర్వాత గరిష్ట స్థాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నికరంగా రూ. 9,980 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 35 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,952 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.98 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.12 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.34 కి చేరింది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.71 నుంచి 0.91 కి పెరిగింది.
  • విక్స్ 1.65 శాతం తగ్గి 13.41 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *