Airport Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Airport Bomb Threat | హైదరాబాద్‌ (Hyderabad)లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి శంషాబాద్ వస్తున్న ప్రముఖ ‘లుఫ్తాన్స’ విమానానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు.

విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ల్యాండ్ అయ్యేలోపే పేలిపోతుందంటూ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ సమాచారంతో ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad Airport) భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు స్పందించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

Airport Bomb Threat | ఫేక్​ ఈ మెయిల్​

అధికారుల తనిఖీల్లో విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇది నకిలీ బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. ఈమెయిల్ పంపిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల శంషాబాద్ ఎయిర్​పోర్టుకు తరచూ నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఫలితంగా అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Heavy Rain 1| హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, విద్యుత్ సరఫరాకు అంతరాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *