అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Sri Krishna Janmashtami | శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను (Janmashtami) జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో (Nizamabad) శ్రీకృష్ణ ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
Sri Krishna Janmashtami | గీతాభవన్‌లో లక్ష పుష్పార్చన..
నగరంలో ప్రముఖ ఆలయమైన శ్రీకృష్ణ గీతాభవన్‌లో తెల్లవారుజాము నుంచి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అలాగే ఆలయంలో రాజు పంతులు, రామనంద్ తివారి ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన జరిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పార్చనలో పాల్గొన్నారు. అలాగే బైపాస్ తర్వాత మారుతినగర్ రోడ్డు హనుమాన్ మందిరం సమీపంలో శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు.
మారుతినగర్ శ్రీకృష్ణ మందిరంలో..
ఇది కూడా చదవండి: Telangana Congress BC Politics | క్రమశిక్షణ పేరిట వర్గ సమరం.. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్న తీరు.. కొండా బర్తరఫ్‌పై బీసీ వర్గాల నిరసన