అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TG RERA | పలు రియల్ ఎస్టేస్ సంస్థలకు టీజీ రెరా షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని బిల్డర్లపై కొరఢా ఝుళిపించింది. ఫ్లాట్‌ను ఆలస్యంగా స్వాధీనం చేయడం, ప్రాజెక్టులను రిజిస్టర్ చేయకపోవడం, రీఫండ్‌లు చెల్లించకపోవడం, అనుమతులు లేకపోవడం వంటి ఫిర్యాదులపై తాజాగా చర్యలు చేపట్టింది.
టీజీ రెరా ఒక డెవలపర్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించి, అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేసింది. ఆ ప్రాజెక్టులోని యూనిట్లను, భవిష్యత్ ప్రాజెక్టులలోని యూనిట్లను మార్కెటింగ్ లేదా విక్రయించకుండా నిషేధించింది. సంగారెడ్డి జిల్లాలోని తమ ఆరా (వెలిమల) ప్రాజెక్టులో ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్ కొనుగోలు చేశారు. వారు 2022లో డబ్బులు చెల్లించారు. అయితే వారికి ఇంకా ఫ్లాట్ అందలేదు. దీంతో రెరా ఆ డెవలపర్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ, 45 రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది,
TG RERA | సనాలి ఐటీ పార్క్స్‌కు జరిమానా
మంచీరేవులలో రిజిస్టర్ కాని తమ ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టును మార్కెటింగ్ చేసినందుకు గాను సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా విధించింది. మియాపూర్‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్ నెం. 502ను అప్పగించడంలో జాప్యం చేసినందుకు కొనుగోలుదారునికి 10.85 శాతం వడ్డీని చెల్లించాలని అరైన్ ఇన్‌ఫ్రాను ఆదేశించింది. తెల్లాపూర్‌లో రిజిస్టర్ కాని సంస్థలో ఫ్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తికి రీఫండ్ చేయాలని త్రిపుర కన్స్ట్రక్షన్కు సూచించింది.
దీనిని కూడా చదవండి : Electric Hair Comb | బట్టతల సమస్యకు చెక్.. ఈ మ్యాజికల్ దువ్వెనతో కేవలం 28 రోజుల్లో కొత్త జుట్టు..!