Jeevan Reddy Criticism | కాంగ్రెస్​ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన : జీవన్​రెడ్డి

కాంగ్రెస్​ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలన అని బీఆర్​ఎస్ ​జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Jeevan Reddy Criticism | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలన అని బీఆర్​ఎస్​(BRS Party) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అన్నారు. నగరంలోని (Nizamabad) పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Jeevan Reddy Criticism | ప్రజలను మోసం చేసి..

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మేనిఫెస్టో విడుదల చేసి, అధికారంలోకి వచ్చి నేటికి మూడేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జీవన్​రెడ్డి విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్​ 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించి మోసం చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలన దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్‌పై విమర్శలతోనే సాగిందని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అంటూ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం వంచించిందని, సీఎం కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు కేసీఆర్ ఎప్పుడు వస్తారని ప్రజలు అడుగుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Jeevan Reddy Criticism | కల్లాల్లోని ధాన్యం.. రైతన్న ధైన్యం

రైతులు పండించిన ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయిందని, వడ్లు కొనుగోలు చేసేవారు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, రైతులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని, ప్రభుత్వ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. సమావేశంలో బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకుడు బాజిరెడ్డి జగన్​మోహన్​, సత్యప్రకాశ్​, సుజిత్​ సింగ్​ ఠాకూర్​, సిర్పరాజు, నుడా మాజీ ఛైర్మన్​ ప్రభాకర్​రెడ్డి తదితరులున్నారు.

ఇది కూడా చదవండి: Ramayana Movie – Lalith Kumar’s Reaction! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *