Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలు

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలను టీటీడీ వెల్లడించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaikunta Dwara Darshan | వైకుంఠ ఏకదాశి సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మంచిదనే నమ్మకం. ఈ క్రమంలో డిసెంబర్​ 20న వైకుంఠ ఏకదాశి నేపథ్యంలో 20 నుంచి 29 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఇందుకు సంబంధించిన టికెట్ల విడుదల వివరాలను తాజాగా టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.

నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు, 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల ఈ-డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. డిసెంబర్ 8న ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల చేయనున్నారు.

Vaikunta Dwara Darshan | వీఐపీ దర్శనాల రద్దు

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేనసినట్లు టీటీడీ తెలిపారు. ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేశారు.

ఇది కూడా చదవండి..:  Kuppam Election Clash | కుప్పంలో ఎన్నికల రక్తపాతం : కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఎలక్షన్ వాహనం దూసుకెళ్లి ఒకరి దుర్మరణం! పరస్పర ఆరోపణలతో అట్టుడుకుతున్న వానగుట్టపల్లి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *