Ponguleti Comments | బీఆర్​ఎస్​లో హరీశ్​రావు ఫ్యూచర్​ ఏంటో.. పొంగులేటి కౌంటర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponguleti Comments | మాజీ మంత్రి హరీశ్​రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. బీఆర్​ఎస్​లో హరీశ్​రావు ఫ్యూచర్​ ఏమిటో ఆయనకే తెలియదని పేర్కొన్నారు.

హరీశ్​రావు (Harish Rao) శుక్రవారం అమెరికాలో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్​ సిటీ రద్దు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడ ఫార్మాసిటీని కొనసాగిస్తామన్నారు. హరీశ్​రావు వ్యాఖ్యలకు పొంగులేటి స్పందించారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్​నించారు.

Ponguleti Comments | అసూయతో..

బీఆర్​ఎస్​ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ (Hyderabad)​లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదని పొంగులేటి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. తాము రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponguleti Comments | నీ ఫ్యూచర్​ కాపాడుకో..

మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డు పడుతున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేశారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తామంటూ హరీశ్​రావు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హరీశ్​రావు రాజకీయ జీవితం ఖతం చేయాలని కేసీఆర్​, కేటీఆర్​ చూస్తున్నారని పొంగులేటి అన్నారు. ‘ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి నీ ఫ్యూచర్ కాపాడుకో’ అని సూచించారు.

ఇది కూడా చదవండి..: CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *