ఆంధ్రప్రదేశ్​Nara Lokesh Support | అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మంత్రి లోకేశ్ అండ.. రూ.23...

Nara Lokesh Support | అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మంత్రి లోకేశ్ అండ.. రూ.23 లక్షల వైద్య ఖర్చు భరిస్తానని హామీ

వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nara Lokesh Support | వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa District) పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి అండగా నిలిచి, అతని చికిత్సకు అవసరమైన పూర్తి వైద్య ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన సాయికుమార్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు శ్రీవిష్ణు పుట్టినప్పటి నుంచే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతుండటంతో తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Nara Lokesh Support | చికిత్స‌కి రూ.23 లక్షలు..

బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో ప్రతి మూడు వారాలకు దాదాపు రూ.16 వేల వరకు ఖర్చు చేస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలు కూడా అమ్ముకోవాల్సి వచ్చినట్లు సమాచారం. చిన్నారికి మరింత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించారు. అయితే, చికిత్స కోసం సుమారు రూ.23 లక్షలు అవసరమవుతాయని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితిలో వారు సహాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

Nara Lokesh Support | మంత్రి లోకేశ్‌పై పలువురు ప్రశంసలు

ఈ క్రమంలో కొండాపురం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న మంత్రి నారా లోకేశ్‌ను ముద్దనూరులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద చిన్నారి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సహాయం కోరారు. వారి బాధను విన్న మంత్రి లోకేశ్ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, “నేను ఉన్నాను.. బాబు ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవద్దు.

అవసరమైన చికిత్స మొత్తం ఏర్పాటు చేస్తాను” అంటూ భరోసా ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీతో చిన్నారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. తమ కుమారుడికి కొత్త జీవితం ఇచ్చే ఆశ చూపినందుకు వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, మానవత్వంతో స్పందించిన వ్యక్తిగా మంత్రి లోకేశ్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Somireddy Comments | జగన్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఫైర్.. 17 ఏళ్ల తర్వాత అనుమానాలా..?

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Drunk Drive Checks | జిల్లాలో డ్రంకన్​​ డ్రైవ్​ తనిఖీలు.. వారంలోనే 162 మందికి జరిమానాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Drive Checks | నిజామాబాద్ పోలీసు...

PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Comments | పీసీసీ చీఫ్​...

Nizamabad Urban Funds | ‘అర్బన్’కు నిధులివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Urban Funds | అర్బన్ అభివృద్ధికి...