PCC Chief Telangana | పీసీసీ చీఫ్​పై వ్యక్తిగత దాడిని ఖండిస్తున్నాం : డీసీసీ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: PCC Chief Telangana | పీపీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​పై (Mahesh Kumar Goud) వ్యక్తిగత దాడిని జిల్లా డీసీసీ తీవ్రంగా ఖండిస్తోందని నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

PCC Chief Telangana | కాంగ్రెస్​ అభివృద్ధికి కృషి

ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ (Congress Telangana)​ అభివృద్ధికి పీసీసీ చీఫ్​ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కాని ఓ టీవీ ఛానల్​లో ఆయనను ఒక విఫల్​ పీసీసీ చీఫ్​గా చూపించడానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20 ఏళ్లుగా ఇలాంటి వ్యక్తిగత దాడి ఏ పీసీసీ అధ్యక్షుడి మీద జరగలేదన్నారు. ఆయనను టార్గెట్​ చేయడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికార(BC Leadership) కాంక్ష ఇటీవలి కాలంలో తారాస్థాయికి చేరుకుందన్నారు. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

PCC Chief Telangana | బీసీ నేతపై దాడిని ఖండిస్తున్నాం

మహేష్ గౌడ్​ను రేవంత్ రెడ్డి (Cm revanth Reddy) తన కొలువులో చేర్చుకుని.. అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారనే ఇటీవల సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్​గా ఫెయిల్ అయ్యారని కొన్ని ఛానళ్లు బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు. ఒక బలమైన బీసీ నేత మీద జరుగుతున్న ఈ విషపు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని..మహేష్ గౌడ్​కు జిల్లా కాంగ్రెస్​ తరపున అన్నివిధాలుగా మద్దతుగా నిలబడతామన్నారు. పార్టీలు వేరైనా.. అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీతోనూ సఖ్యతగా ఉండే ఆయనపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *