నిజామాబాద్Bhupathi Reddy Support | అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Bhupathi Reddy Support | అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ఇటీవల గాలివాన బీభత్సంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.

అక్షరటుడే, డిచ్ పల్లి,మోపాల్: Bhupathi Reddy Support | ఇటీవల గాలివాన బీభత్సంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) పేర్కొన్నారు. మోపాల్ మండలం మంచిప్ప, బైరాపూర్ గ్రామాల్లో జరిగిన నష్టాన్ని ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Bhupathi Reddy Support | రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి..

ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన నష్టాన్ని, ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంచిప్పలో 16 కుటుంబాలకు, బైరాపూర్​లో నష్టపోయిన 16 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు ఎమ్మెల్యే వద్ద బావోద్వేగానికి గురికాగా.. ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఆదుకుంటుందని భరోసా కల్పించారు. విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ సంబంధిత అధికారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి.. బాధితులకు పరిహారం అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

Bhupathi Reddy Support | బాధితులను ఆదుకుంటాం..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించిన సంఘటనలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. ఈనెల 19న గాలివాన బీభత్సం విషయం తెలుసుకొని తక్షణమే అధికారులతో, ఆయా గ్రామాల సర్పంచ్​లో ఫోన్​లో మాట్లాడడం జరిగిందన్నారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఏపీ పర్యటనలో ఉండడం కారణంగా తక్షణమే రాలేకపోయానని తెలిపారు.

ఈ సంఘటనలో మంచిప్పలో 16 ఇళ్లు దెబ్బతినగా అందులో 12 పాక్షికంగా మిగతా 4 తీవ్రంగా దెబ్బతిన్నాయని.. వారికి పరిహారం అందిస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, డీసీసీ సెక్రటరీ కద్దు రాం సాయి కుమార్​, పార్టీ మండల అధ్యక్షుడు మోపాల్ సాయరెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ సింగ్ , మంచిప్ప సర్పంచ్ గంగామణి-రాజేష్, బైరాపూర్ సర్పంచ్ కేతావత్ శాంత-వసంత్, సుభాష్​, కిరణ్​ రావ్​, తహశీల్దార్​, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fee Regulation Act | ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్ర చట్టాన్ని అమలు చేయాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

White House Shooting | వైట్ హౌస్ వద్ద బుల్లెట్ల వర్షం.. 30 రౌండ్ల కాల్పులు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: White House Shooting | వైట్ హౌస్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు...

May 24 Horoscope | ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 24 Horoscope : గ్రహస్థితుల ఆధారంగా మేషం...