తెలంగాణCSR Support Schools | సర్కార్​ బడులకు కార్పొరేట్​ సంస్థల చేయూత.. సీఎం సమక్షంలో ఒప్పందం

CSR Support Schools | సర్కార్​ బడులకు కార్పొరేట్​ సంస్థల చేయూత.. సీఎం సమక్షంలో ఒప్పందం

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రముఖ కార్పొరేట్​ సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎస్​ఆర్​ నిధులతో బడులను అభివృద్ధి చేయనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CSR Support Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రముఖ కార్పొరేట్​ సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎస్​ఆర్​ నిధులతో బడులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి.

కార్పొరేట్ సంస్థలు రహేజ గ్రూప్​, రాంకీ ఫౌండేషన్​, యశోద ఫౌండేషన్​ సీఎస్​ఆర్​ నిధులతో సర్కార్​ బడుల్లో వసతులు కల్పించడానికి ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు శనివారం సీఎంతో సమావేశం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఒక కొత్త సమీకృత ప్రాంగణాన్ని నిర్మించడానికి రాంకీ ఫౌండేషన్​ (Ramky Foundation) రూ.19.66 కోట్లు అందించనుంది. ఇది ప్రాజెక్ట్​ వ్యయంలో 40 శాతం కావడం గమనార్హం. మహేశ్వరం మండలంలోని తుక్కుగూడలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధునీకరణ కోసం రూ.10.4 కోట్లు అందించనుంది.

CSR Support Schools | రూ.50 కోట్లతో..

రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్​ వరకు విద్యా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కె రహేజా గ్రూప్​ రూ.50.50 కోట్లు నిధులు సమకూరుస్తుంది. ఉప్పల్​లోని సుభాష్​ నగరలో ఎంపీపీఎస్​ పాఠశాలలో వసతుల కల్పనకు యశోద ఫౌండేషన్​ రూ.12.20 కోట్లు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయా సంస్థలు ఒప్పంద పత్రాలు అందించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Ponguleti Comments | బీఆర్​ఎస్​లో హరీశ్​రావు ఫ్యూచర్​ ఏంటో.. పొంగులేటి కౌంటర్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 24 Horoscope | ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 24 Horoscope : గ్రహస్థితుల ఆధారంగా మేషం...

Telangana Cabinet Decisions | రెండో విడత ఇళ్లు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | తెలంగాణలో రెండో విడ‌త...