అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengal BJP | పశ్చిమ బెంగాల్లో బీజేపీ మరో బంపర్ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఘనవిజయంతో సంచలనం సృష్టించాడు. ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిని రీపోలింగ్‌లో దేబాంగ్షు పాండా.. సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Bengal BJP | భారీ మెజారిటీ..
ఫాల్టా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించారు. మొత్తం 285 పోలింగ్ కేంద్రాలలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఇటీవల రీపోలింగ్ నిర్వహించారు. తుది లెక్కల ప్రకారం.. బీజేపీ అభ్యర్థి పాండా 1,49,666 ఓట్లు సాధించగా, సీఎం అభ్యర్థి కుర్మి 40,645 ఓట్లు పొందారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 10,084 ఓట్లు పొందగా, అంతకుముందే పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 7,783 ఓట్లు సాధించారు.
Bengal BJP | వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి
ఫాల్టా అసెంబ్లీ నియోజవర్గంలో ఇటీవల రీపోలింగ్ నిర్వహించారు. అయితే పోలింగ్‌కు రెండు రోజుల ముందు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ బరిలో నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో ఆయన తప్పుకోవడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఇది కూడా చదవండి..: Udhayanidhi Stalin | పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ : ఉదయనిధి స్టాలిన్


