RTC Bus CC Camera | ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు

Naresh Chandan

RTC Bus CC Camera | ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చింది.

RTC Bus CC Camera | ప్రత్యేక కంట్రోల్ రూమ్

ఆర్టీసీ బస్సుల్లో జరిగే దొంగతనాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పసిగట్టేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని సర్కారు భావిస్తోంది.

బస్సుల్లో అమర్చిన ఈ కెమెరాల విజువల్స్ అన్నింటినీ ఆర్టీసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా పూర్తి ఏర్పాట్లు చేశారు.

పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం 175 బస్సుల్లో ఈ సీసీ కెమెరాలను బిగించారు.

ఆదిలాబాద్‌ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *