జాతీయంFuel Price Hike | మోదీ మార్క్ 'ఇంధన దోపిడీ'.. రూ.43 లక్షల కోట్లు లూటీ...

Fuel Price Hike | మోదీ మార్క్ ‘ఇంధన దోపిడీ’.. రూ.43 లక్షల కోట్లు లూటీ చేశారంటూ ఖర్గే ఫైర్

దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్:Fuel Price Hike| దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్య ప్రజల కష్టార్జితాన్ని, పొదుపు మొత్తాలను తగలబెట్టేందుకు మోదీ సర్కారు పెట్రోల్ చల్లుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. గడిచిన రెండు వారాల వ్యవధిలోనే ఇంధన ధరలను పెంచడం ఇది నాలుగోసారి అని, ఈ రోజువారీ దోపిడీకి అంతం లేకుండా పోయిందని మండిపడ్డారు.

Fuel Price Hike | 12 ఏళ్లలో రూ.43 లక్షల కోట్ల లూటీ..

గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో ఇంధన ధరల పేరుతో మోదీ ప్రభుత్వం ఏకంగా రూ.43 లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిందని ఖర్గే విరుచుకుపడ్డారు. 2014లో రూ.71.41 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ప్రస్తుతానికి రూ.102 దాటించారని ఎద్దేవా చేశారు. ఇంధన ధరల భారాన్ని దేశంలోని రైతుల నుంచి మొదలుకొని ఎంఎస్ఎంఈ (MSME)ల వరకు ప్రతి ఒక్కరూ మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాల కంటే కార్పొరేట్ లాభాలకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందనడానికి.. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన HPCL, BPCL, IOC షేర్లు భారీగా పెరగడమే నిదర్శనమన్నారు.

Fuel Price Hike | దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ధరలు..

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. తాజా సవరణతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున అదనపు భారం పడింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పెంపుతో భాగ్యనగరాసులపై భారం మరింత ముదిరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 కి చేరగా, డీజిల్ ధర రూ.103.74 కు పెరిగింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12 కాగా, డీజిల్ రూ.95.20 గా నమోదైంది. రెండు వారాల్లోనే నాలుగోసారి ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: Paragliding Plane Collision| మృత్యుంజయురాలు.. గాల్లో విమానం పారాగ్లైడర్‌ను ఢీకొట్టినా..!

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mahesh Kumar Goud | తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది..: టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

అక్షరటుడే, కామారెడ్డి: Mahesh Kumar Goud | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్...

Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market india | దేశీయ స్టాక్ మార్కెట్...

హైదరాబాద్‌ టెక్‌ అద్భుతం.. గాల్లోకి లేవనున్న భారీ కార్గో విమానం ‘జెన్ #2’

హైదరాబాద్‌కు చెందిన డీప్‌-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ 'బ్లూజే ఏరోస్పేస్' (BluJ Aerospace)...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలు షురూ

ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన సిబ్బంది కోసం సరికొత్త...