జాతీయంKarnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదు.. దానిపైనే చర్చ

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదు.. దానిపైనే చర్చ

కర్ణాటకలో సీఎం మార్పు లేదని కాంగ్రెస్​ అధిష్టానం స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికలపై చర్చించినట్లు కేసీ వేణుగోపాల్​ తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదని కాంగ్రెస్​ అధిష్టానం స్పష్టం చేసింది. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ సమావేశం ముగిసింది. ఆరు గంటలకుపైగా నేతలు పలు అంశాలపై చర్చించారు.

కర్ణాటక నాయకత్వంలో మార్పు లేదని. సీఎం మార్పు వార్తలన్నీ ఊహాగానాలే అని కాంగ్రెస్​ నాయకుడు కేసీ వేణుగోపాల్ (KC Venugopla) తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ సీఎం పదవి ఆశిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలతో ఖర్గే, రాహుల్​ గాంధీ భేటీ కావడం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు పక్కా అని వార్తలు వచ్చాయి. అయితే వాటిని కేసీ వేణుగోపాల్​ కొట్టిపారేశారు.

Karnataka CM Change | ఆ ఎన్నికలపై చర్చించాం

ఢిల్లీ (Delhi)లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు (Karnataka CM Change) జరగవచ్చనే ఊహాగానాలకు కొత్త ఊపు వచ్చింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడికి సంబంధించిన ఎలాంటి చర్చలు జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది.

kc venugopal

కేసీ వేణుగోపాల్ ఈ ఆరోపణలను గట్టిగా ఖండించారు. రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలపై చర్చించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని రాజ్యసభ సీట్లు, శాసన మండలి ఎన్నికల వ్యూహంతో సహా, చర్చలు పూర్తిగా ఎన్నికల సంబంధిత అంశాలపైనే కేంద్రీకృతమయ్యాయని వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను...

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...

భారత్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టుమారో మేకర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రేజ్ ఫౌండేషన్

వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త జాతీయ...

Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు...