తెలంగాణACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

నాలా కన్వర్షన్​ కోసం శామీర్​పేట తహశీల్దార్​ రూ.30 లక్షల లంచం డిమాండ్​ చేసింది. ఆమెను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా శామీర్​పేట మండల తహశీల్దార్​ (Shamirpet Tahsildar) సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్​ కోసం ఆమె రూ.30 లక్షలు లంచం డిమాండ్​ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ (ACB) అధికారులు కేసు వివరాలు వెల్లడించారు.

శామీర్​పేట తహశీల్దార్​ సుచరిత (Tahsildar Sucharita) మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు (ACB Raid ) చిక్కారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిని నాలాగా మార్చే దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించడం కోసం ఆమె ఏకంగా రూ.30 లక్షల లంచం డిమాండ్​ చేసింది. తన ప్రైవేట్​ డ్రైవర్​ వి నాగేశ్​ ద్వారా మంగళవారం రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్​ సుచరిత, ఆమె డ్రైవర్​ నాగేశ్​ను అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ACB Raid | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు తహశీల్దార్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజా కేసులో నాలా మార్పిడి కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​ చేసిందంటే ఆమె గతంలో ఎంత మొత్తం వసూళ్లకు పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ కేసుల్లో చిక్కిన వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి.. ఆస్తులను జప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వారిని పూర్తిగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Panchayat Staff Salaries | రాష్ట్రంలోని 50 వేల...

KVIC Khadi Growth | ఖద్దరుకు ‘మహా’ వైభవం.. ₹1.87 లక్షల కోట్లకు చేరిన ఖాదీ టర్నోవర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KVIC Khadi Growth | భారతీయ సంస్కృతికి, స్వదేశీ...

Karnataka Congress Reset | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘పవర్ రీసెట్’.. సిద్ధరామయ్యకు స్థానచలనం.. శివకుమార్‌కు పట్టాభిషేకం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Congress Reset | దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా...

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను...