సినిమాAnasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, ఏఐ వీడియోలతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నటి అనసూయ కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anasuya cyber harassment | సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు ముప్పు కూడా అధికమవుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.

ఇదే నేపథ్యంలో నటి అనసూయ భరద్వాజ్ anasuya bharadwaj కి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులు పెడుతూ, ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని, దీనికితోడు ఏఐ టెక్నాలజీ ద్వారా అభ్యంతరకర వీడియోలు సృష్టిస్తూ తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అనసూయ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టుల లింకులు, ఫొటోల ఆధారాలను ఆమె సమర్పించారు.Untitled 1.jpganasuya 1

Anasuya cyber harassment : అశ్లీల కంటెంట్​..

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు Police కేసును సీరియస్‌గా తీసుకుని సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నల్గొండ జిల్లా, అల్వాల్ గ్రామానికి చెందిన దోరెపల్లి చంటి అనే యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

2025 సంవత్సరం నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనసూయను లక్ష్యంగా చేసుకుని అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అభ్యంతరకర భాషను ఉపయోగిస్తూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసేలా కంటెంట్ సృష్టించినట్లు విచారణలో తేలింది.

ఈ మేరకు చంటిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 79, 336(4), 351, 356తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E, 67 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.Untitled 2.jpgana

Anasuya cyber harassment | తీవ్ర ట్రోలింగ్‌

గత కొంతకాలంగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను Trolling ఎదుర్కొంటున్నారు. విజయ్ దేవరకొండతో జరిగిన వివాదం, అలాగే శివాజీతో సంబంధిత కాంట్రవర్సీల సమయంలో కూడా ఆమెను కొందరు నెటిజన్లు, అభిమానులు తీవ్రంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ట్రోలింగ్‌కు ఆమె కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇటీవల పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో తన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలుగుతోందని భావించిన అనసూయ చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించారు.

ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికల వినియోగంపై బాధ్యతాయుత ప్రవర్తన అవసరంపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళలపై ఆన్‌లైన్ వేధింపులు, డిజిటల్ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....