Maize Procurement | మక్కలు కొనుగోలు చేయాలని సొసైటీ ఎదుట రైతుల ధర్నా..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Procurement | రాజంపేట మండలంలోని (Rajampet) అర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు బుధవారం ధర్నాకు దిగారు. మొక్కజొన్న (Maize) కొనుగోలు కోసం లారీలు రావడం లేదని, తూకం వేసిన కుప్పలు అకాల వర్షాలకు (Unseasonal rains) తడిసి ముద్దవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Maize Procurement | లారీల కోసం ఎదురుచూపులు..

కొనుగోలు కేంద్రం ప్రారంభమై వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క లారీ కూడా రాలేదని, దీంతో కేంద్రం వద్దే కుప్పలు కుప్పలుగా మొక్కజొన్న పేరుకుపోయిందని రైతులు వాపోయారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న తడిసిపోతోందని (rain damaged maize), దీన్ని ఆరబెట్టేందుకు అదనంగా కూలీల ఖర్చు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన మొక్కజొన్నను కొనేవారు లేక, తేమ శాతం ఎక్కువైందని తిరస్కరిస్తారేమోనని భయపడుతున్నామని తెలిపారు.

పంట చేతికి వచ్చినా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని.. లారీలు పంపించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. తడిసిన మొక్కజొన్నకు కూడా మద్దతు ధర చెల్లించాలని వారు కోరారు. సొసైటీ అధికారులు స్పందించి వెంటనే లారీలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Jeddah Tower | వామ్మో.. కిలోమీటర్ ఎత్తా!.. జెడ్డాలో 100 అంతస్తులు పూర్తయిన నిర్మాణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *