ACB RTA Raids | ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు.. బట్టబయలైన బ్రోకర్ల దందా!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB RTA Raids | హైదరాబాద్ నగరంలోని ప్రాంతీయ రవాణా శాఖ (RTA) కార్యాలయాల్లో దళారుల నెట్‌వర్క్ ఎంతలా వేళ్లూనుకుందో అవినీతి నిరోధక శాఖ (ACB) జరిపిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆర్‌టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కార్యాలయాల్లోనే తిష్టవేసిన దళారులు, వారికి సహకరిస్తున్న అధికారుల తీరు బట్టబయలైంది.

ACB RTA Raids | అభ్యర్థులు లేకుండానే లైసెన్సులు..

ఏసీబీ సోదాల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర అంశాలు ఇవే:

దళారుల రాజ్యమే ఏలుబడి: దరఖాస్తుదారులు లేకుండానే ఏజెంట్లు స్వయంగా లైసెన్స్ ప్రక్రియలను పూర్తి చేస్తూ పట్టుబడ్డారు. ఆర్‌టీఏలోని వివిధ విభాగాల్లోకి దళారులకు అధికారులు స్వేచ్ఛగా ప్రవేశం కల్పించినట్లు తేలింది.

భారీగా పత్రాల గుర్తింపు: అనధికార వ్యక్తుల వద్ద నుంచి సుమారు 150 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RCలు), డ్రైవింగ్ లైసెన్సులను (DLs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్క ఏజెంట్ వద్దే 184 లైసెన్సులు: నాగోల్, పరిసర కార్యాలయాల్లో తనిఖీల్లో.. కేవలం ఒక్క బ్రోకర్ వద్దనే ఏకంగా 184 డ్రైవింగ్ లైసెన్సులు లభించడం అక్కడి అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది.

నగదు స్వాధీనం: కార్యాలయ ప్రాంగణంలో తిరుగుతున్న ఏజెంట్ల నుంచి ₹41,130 నగదును ఏసీబీ అధికారులు రికవరీ చేశారు.

ACB RTA Raids | నాగోల్‌లో విచిత్రం

నాగోల్ ఆర్‌టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్‌ల నిర్వహణ తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల రోజున వచ్చిన 185 డ్రైవింగ్ టెస్ట్ దరఖాస్తుల్లో ఒక్క దాన్ని కూడా తిరస్కరించకుండా, అన్నింటినీ ఆమోదించడం గమనార్హం. దళారుల జోక్యంతోనే టెస్టులు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలకు ఇది బలచేకూరుస్తోంది.

akshara today .jpgACB HQ

ACB RTA Raids | తపాలా ద్వారా వెళ్లాల్సిన కార్డులు దళారుల చేతుల్లోకి..

నిబంధనల ప్రకారం.. ముద్రించిన ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్సులను దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

అయితే, అధికారులు ఈ కార్డులను నేరుగా ఏజెంట్ల చేతిలోనే పెడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కార్డులను దళారులు తమ వద్ద ఉంచుకుని, వాహనదారుల నుంచి అదనంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి అప్పగిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. నిందితులైన అధికారులు, ఏజెంట్లపై కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *