Telangana Tahsildars Transfer | తెలంగాణలో 12 మంది తహసీల్దార్ల బదిలీ : రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Tahsildars Transfer | రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, అవసరాల దృష్ట్యా రెవెన్యూ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరికి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO), స్పెషల్ కలెక్టర్ పర్సనల్ అసిస్టెంట్లు (Special Collector PA), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC)గా పదోన్నతులు/బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana Tahsildars Transfer

Telangana Tahsildars Transfer | తక్షణమే బాధ్యతలు

బదిలీ అయిన అధికారులను తక్షణమే నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల నిబంధనలు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

బదిలీల పూర్తి వివరాలు, ఏ అధికారిని ఏ స్థానానికి బదిలీ చేశారనే నియామక పత్రాల (Orders) కాపీలను ఆయా జిల్లాల కలెక్టరేట్లకు, సంబంధిత అధికారులకు ఇప్పటికే చేరవేసినట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది.

Telangana Tahsildars Transfer | బదిలీ అయిన అధికారులు – కొత్త పోస్టింగులు

మేడ్చల్-మల్కాజిగిరి నుంచి J. స్వామి → కరీంనగర్ DRO
నాగర్‌కర్నూల్ నుంచి A. పాండు → కామారెడ్డి DRO
నిర్మల్ తహశీల్దార్ A. మోతీరామ్ ఎ. → మంచిర్యాల DRO
వనపర్తి నుంచి R. పాండు → నాగర్‌కర్నూల్ DRO
ఖమ్మం నుంచి V. రవికుమార్ → ములుగు DRO
కరీంనగర్‌కు చెందిన B. రాజేశ్వరి → పెద్దపల్లి DRO
పెద్దపల్లికి చెందిన KY. ప్రసాద్ → జగిత్యాల DRO

ఎస్డీసీ / ప్రత్యేక పోస్టింగులు

M. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) → సిద్దిపేట ఎస్డీసీ
M. రమాదేవి (ఖమ్మం) → నల్గొండ ఎస్డీసీ
జనగామ తహశీల్దార్ CH. శ్రీకాంత్ → మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏ
G. కుమారస్వామి (పెద్దపల్లి) → సిరిసిల్ల ఎస్డీసీ
N. వెంకట్ రెడ్డి (కరీంనగర్) → కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ)

T-Fiber Internet | ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *