అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Sooryavanshi | ఐపీఎల్ 2026 సీజన్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (vaibhav sooryavanshi) పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బౌలర్లపై ఈ 15 ఏళ్ల కుర్రాడు చూపించిన విధ్వంసం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు. హైదరాబాద్ ఓటమితో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.
Vaibhav Sooryavanshi | సెంచరీకి మూడు పరుగుల దూరంలో..
సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయినా, తన తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. పవర్ హిట్టింగ్తో మైదానాన్ని ఊపేసిన అతడు.. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్లో ఇప్పటికే 65 సిక్సర్లు నమోదు చేశాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్‌ల్లో 680 పరుగులు చేసిన వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు.
Vaibhav Sooryavanshi | 16 బంతుల్లో అర్ధ సెంచరీ..
ఎస్ఆర్హెచ్పై అతడు కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ప్లే ఆఫ్స్‌లో (Play off) అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనాతో సమంగా నిలిచాడు. ప్లే ఆఫ్స్‌లో 16 బంతుల్లో ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందాడు.
Vaibhav Sooryavanshi | ప్లే ఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు..
సురేశ్ రైనా – 16 బంతులు
వైభవ్ సూర్యవంశీ – 16 బంతులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 17 బంతులు
ఎంఎస్ ధోని – 20 బంతులు
ఇక 20 బంతుల్లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. అభిషేక్ శర్మ ఆరు సార్లు ఈ ఘనత సాధించగా, నికోలస్ పూరన్‌తో కలిసి వైభవ్ ఐదు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. పవర్ ప్లేలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్ (David warner) ఆరు సార్లు ఈ ఘనత సాధించగా, వైభవ్ ఐదు సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ (Travis Head) నాలుగు సార్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Vaibhav Sooryavanshi | అత్యధిక సిక్సర్లు బాదిన..
అంతేకాదు.. ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు Sixers బాదిన ఆటగాడిగానూ వైభవ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఎస్ఆర్హెచ్పై పవర్ ప్లేలోనే 8 సిక్సర్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఈ క్రమంలో సనత్ జయసూర్య, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, అభిషేక్ శర్మల రికార్డులను అధిగమించాడు. ఒక్క మ్యాచ్‌తోనే కాదు.. మొత్తం సీజన్‌తో వైభవ్ సూర్యవంశీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడి ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడంటూ సోషల్ మీడియాలో వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే సెంచరీ మిస్ అయిన క్రమంలో సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆవేదన, కళ్లల్లో కదిలాడిన నీళ్లు చూసి స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు.

Kavya maran was crying ??pic.twitter.com/97y5viLUxU
— Kartik Sharma (@KartikSharmaFC) May 28, 2026
ఇది కూడా చదవండి: Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన


