May 29 Market Analysis | పాజిటివ్​గా గ్లోబల్ క్యూస్.. ఫ్లాట్​గా ప్రారంభం కానున్న సెన్సెక్స్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 29 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో మూడు నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణను నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్‌లు తాత్కాలిక ఒప్పందానికి దగ్గరవుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ (Wallstreet) లాభాలతో ముగిసింది. మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.

May 29 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

అమెరికా – ఇరాన్ శాంతి ఒప్పందంపై వస్తున్న వార్తలు పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచడంతో గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయి ముగింపులను నమోదు చేశాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.91 శాతం, ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం లాభంతో ఉంది.

Stock Market

May 29 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.76 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.34 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.23 శాతం నష్టపోయాయి.

May 29 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.27 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.12 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.03 శాతం లాభాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.75 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.37 శాతం లాభాలతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.22 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.08 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

akshara today 1 2.jpgmarket 2
April 22 market Analysis

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,042 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 8వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,821 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.07 నుంచి 1.02 కు తగ్గింది.
  • విక్స్(VIX) 7.13 శాతం తగ్గి 14.98 వద్ద ఉంది. ఏడు సెషన్లలో 25 శాతం తగ్గడం గమనార్హం. విక్స్ 15 కన్నా దిగువన ఉండడం బుల్స్‌కు సానుకూలం.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. బ్యారెల్‌కు 91.80 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.69 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.02 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.44 వద్ద ఉన్నాయి.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?.. నెట్టింట వరలక్ష్మి శరత్ కుమార్ వ్యాఖ్యల దుమారం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *