అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu Election | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు చివరి రోజు జోరుగా ప్రచారం చేయనున్నాయి.
తమిళనాడు (Tamil Nadu)లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది. సినీ నటుడు విజయ్ (Vijay) పార్టీ టీవీకే పలు స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందో చూడాలి. అన్ని పార్టీలో ఇన్ని రోజులు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎలాగైన అధికారంలోకి రావాలని ఏఐడీఎం (AIDM)కే ప్రయత్నిస్తుండగా.. అధికారాన్ని కాపాడుకోవాలని డీఎంకే చూస్తోంది. దీంతో అన్ని పార్టీలో ఓటర్లపై వరాలు జల్లులు కురిపించాయి. ఇన్ని రోజులు జోరుగా సాగిన ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.
Tamil Nadu Election | డీఎంకేకు ఎంఐఎం మద్దతు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక (Tamil Nadu Assembly Election)ల్లో ఎంఐంఎం పార్టీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు తెలిపింది. ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వీడియో విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ DMK అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కాగా తమిళనాడులో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అయితే అక్కడ ఎంఐఎంకు పట్టు లేదు. దీంతో డీఎంకేకు ఆ పార్టీ మద్దతు తెలిపింది.

Tamil Nadu Election | బెంగాల్లో..
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో తొలి విడత ప్రచారం నేటితో ముగియనుంది. ఏప్రిల్ 23న 152 సీట్లకు తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. 29న 142 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. మమతా బెనర్జీ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోదీ (Prime Minister Modi), అమిత్ షా (Amit Shah) సహా కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Pharma Reactor Explosion | గడ్డపోతారం పారిశ్రామికవాడలో పేలుడు..

