Tirupati ASI Drunk | తిరుపతిలో మద్యం మత్తులో ఏఎస్సై హల్​చల్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirupati ASI Drunk | భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి (Tirupati)లో ఓ ఏఎస్సై మద్యం మత్తులో హల్​చల్​ చేశాడు. పూటుగా తాగి ఓ హోటల్​ యజమానితో గొడవ పడ్డాడు.

ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని పూర్వీక సెంటర్లో ఉన్న హోటల్ యజమానిపై ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము దాడిగి దిగారు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ యజమానిపై దాడి చేయడంతో, తిరిగి ఏఎస్ఐపై హోటల్ యజమాని దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు వారిని విడిపించారు.

Tirupati ASI Drunk | శాఖకు మచ్చ తెస్తున్నారు

కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో శాఖకు చెడ్డపేరు వస్తోంది. బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు.. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరిస్తున్నారు. పలువురు చాయ్​, టిఫిన్​ సెంటర్​లలో డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే పోలీసులమని దబాయిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: KNR Illegal Wealth | జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఆస్తులపై సిట్ దర్యాప్తు.. మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తుల గుర్తింపు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *