అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anthropic Valuation | అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కంపెనీ ఆంథ్రోపిక్.. సంచలనం సృష్టిస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన ఏఐ టూల్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి.
దీని ప్రభావంతో సాఫ్ట్వేర్, లీగల్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో సేవలందిస్తున్న సంప్రదాయ ఐటీ కంపెనీల షేర్లు భారీగా విలువను కోల్పోయాయి. ప్రధానంగా ఈ రంగంలో సేవలందిస్తున్న భారత్‌కు చెందిన కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఆంథ్రోపిక్ మాత్రం మార్కెట్లో తన వాటాను పెంచుకుంటూ పోతూనే ఉంది.
Anthropic Valuation | విపరీతమైన డిమాండ్‌తో…
ఈ ఏడాది ప్రారంభంలో ఆంథ్రోపిక్ కంపెనీ (Anthropic Company) విలువ 380 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అప్పటి నుంచి వేగవంతమైన ఆదాయ వృద్ధి, దాని ఏఐ ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ అయిన క్లాడ్ కోడ్ చుట్టూ ఉన్న ఊపుకు పెట్టుబడిదారులు ముగ్ధులవడంతో సిలికాన్ వ్యాలీ (Silicon Valley)లో ఈ కంపెనీ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానందున పెట్టుబడిదారులలో అత్యధికులు సెకండరీ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ సెకండరీ మార్కెట్లో ఆయా కంపెనీలలోని ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు లేదా తొలి పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను అమ్ముతున్నారు.
Anthropic Valuation | పెరుగుతున్న ఏఐ స్టాక్స్..
కృత్రిమ మేధకు సంబంధించిన రంగాల్లోని సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరుగుతోంది. ఇటీవలే చిప్‌ల తయారీ కంపెనీలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ టెక్నాలజీ, ఎస్కే హైనిక్స్‌లు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను తాకాయి. ఈ జాబితాలో తాజాగా ఆంథ్రోపిక్ చేరింది. దీనిలో ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సెక్వోయా క్యాపిటల్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. గూగుల్ సంస్థ 40 బిలియన్ డాలర్లు, అమెజాన్ 5 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చినట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ టెక్నాలజీ, ఎస్కే హైనిక్స్‌లు కూడా దీని ఇన్వెస్టర్ల జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Ganga Expressway Cracks | మోదీ ప్రారంభించిన రోడ్డు, నెలలోపే పగుళ్లు… అదానీ ఇదేంటి?


