క్రీడలుVaibhav Suryavanshi Emotional | క్వాలిఫయర్-2 ఓటమితో కన్నీటి పర్యంతమైన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైర‌ల్‌

Vaibhav Suryavanshi Emotional | క్వాలిఫయర్-2 ఓటమితో కన్నీటి పర్యంతమైన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైర‌ల్‌

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vaibhav Suryavanshi Emotional | ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున ఈ సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్.. గుజరాత్‌పై కూడా తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.

అయితే అతడి పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.శుక్రవారం జరిగిన కీలక క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీకి చేరువలో నిలిచినా, వ్యక్తిగత మైలురాయి మిస్ కావడంపై అతడు పెద్దగా నిరాశ చెందలేదు. కానీ జట్టు ఓడిపోవడం మాత్రం అతడిని తీవ్రంగా కలిచివేసింది.

Vaibhav Suryavanshi Emotional | క‌న్నీళ్లు పెట్టుకున్న వైభ‌వ్..

Vaibhav Suryavanshi Emotional

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వైభవ్ నేరుగా డగౌట్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని తన క్యాప్‌తో ముఖాన్ని కప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లలేకపోయాననే బాధ అతడి కళ్లలో స్పష్టంగా కనిపించింది. 15 ఏళ్ల వయసులోనే జట్టుపై ఉన్న బాధ్యతాభావం, Rajastan Royals గెలుపుపై ఉన్న తపన అతడి భావోద్వేగాల్లో ప్రతిబింబించింది. వైభవ్ ఏడుస్తుండటాన్ని గమనించిన రాజస్థాన్ రాయల్స్ సపోర్టింగ్ స్టాఫ్ వెంటనే అతడి వద్దకు వెళ్లి ఓదార్చారు. కొంతసేపటి తర్వాత అతడు తనను తాను కూల్‌ చేసుకుని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. అనంతరం మ్యాచ్ అనంతర కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు కూడా అందుకున్నాడు.

Vaibhav Suryavanshi Emotional | భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం

Vaibhav Suryavanshi Emotional

అంతేకాకుండా, ఆ సమయంలో తనతో ఫొటోలు దిగాలని కోరిన గ్రౌండ్ స్టాఫ్, భద్రతా సిబ్బంది అభ్యర్థనను కూడా అతడు తిరస్కరించలేదు. బాధలో ఉన్నప్పటికీ వారితో చిరునవ్వుతో ఫొటోలు దిగడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. వైభవ్ కన్నీళ్లు కార్చిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి. “ఇదే నిజమైన స్పోర్ట్స్‌మన్‌షిప్”, “జట్టు కోసం ఇంతగా ఫీలయ్యే ఆటగాళ్లు అరుదు”, “ఈ ఓటమి అతడిని మరింత గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దుతుంది” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Vaibhav Suryavanshi Emotional | గుర్తింపు తెచ్చుకున్న వైభవ్

ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఓటమి సమయంలో చూపిన భావోద్వేగంతో కూడా అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భవిష్యత్తులో ఈ యువ క్రికెటర్ మరెన్నో విజయాలు సాధించి భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదిస్తాడనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Ashwin SRH Speech | తగ్గేదేలే.. SRH తగలబెట్టాలి”.. తెలుగులో అశ్విన్ ఫైర్, ఆరెంజ్ ఆర్మీకి భారీ సపోర్ట్!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Paddy Lorry Overturn | అన్నదాతకు తీరని కష్టాలు.. జల్దిపల్లి వద్ద వడ్ల లారీ బోల్తా

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Paddy Lorry Overturn | రైతులకు ధాన్యం...

Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Travel Bus Fire | ఓ ప్రైవేట్​ ట్రావెల్స్...

Traffic Records Before Marriage | అల్లుడిపై ట్రాఫిక్ వెరిఫికేషన్.. ‘డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు ఉంటే పెళ్లే లేదు’ అన్న తండ్రి!

అక్షరటుడే, వెబ్​డెస్క్:Traffic Records Before Marriage | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా...

Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Forecast | రాష్ట్రాన్ని అకాల వర్షాలు వీడటం...