Traffic Records Before Marriage | అల్లుడిపై ట్రాఫిక్ వెరిఫికేషన్.. ‘డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు ఉంటే పెళ్లే లేదు’ అన్న తండ్రి!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Traffic Records Before Marriage | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా (Kakinada District)లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కుటుంబ నేపథ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిశీలించడం సహజం. అయితే కాకినాడకు చెందిన ఓ తండ్రి మాత్రం తన కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

కూతురికి నిశ్చయమైన వరుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కాబోయే అల్లుడి కారు, బైక్ నంబర్లను సేకరించి నేరుగా స్థానిక ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ట్రాఫిక్ సీఐని కలిసి, “మా అల్లుడికి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులేమైనా ఉన్నాయా? అతను తరచూ ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘిస్తాడా? స్పీడింగ్ చలానాలు లేదా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఏమైనా ఉందా?” అంటూ పూర్తి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.

Traffic Records Before Marriage | కూతురిపై ప్రేమ‌..

Traffic Records Before Marriage

మొదట ఈ అభ్యర్థన విన్న ట్రాఫిక్ అధికారులు (Traffic Officers) ఆశ్చర్యపోయినా, అనంతరం దీనిని ఓ ప్రత్యేకమైన వెరిఫికేషన్ విధానంగా భావించి సంబంధిత రికార్డులను పరిశీలించినట్లు చెబుతున్నారు. తన కూతురి భవిష్యత్తుపై ఆ తండ్రికి ఉన్న శ్రద్ధను గమనించి అధికారులు కూడా వివరాలను పరిశీలించారట. రికార్డుల పరిశీలన అనంతరం కాబోయే అల్లుడిపై ఎలాంటి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు లేవని, స్పీడింగ్ టికెట్లు లేదా తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర కూడా కనిపించలేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆ తండ్రి ఊపిరి పీల్చుకుని పెళ్లికి అంగీకారం తెలిపినట్లు తెలిసింది.

Traffic Records Before Marriage | సోషల్ మీడియాలో విస్తృత చర్చ

ఈ సందర్భంగా సదరు తండ్రి పోలీసులకు తన మనసులోని బాధ‌ను కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. కూతురు చిన్న వయసులోనే త‌న భార్య‌ మరణించిందని, అప్పటి నుంచి ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా పెంచానని చెప్పారట. భవిష్యత్తులో తన కూతురు సుఖంగా ఉండాలంటే అల్లుడి ప్రవర్తన కూడా మంచిదై ఉండాలని భావించి ఈ వెరిఫికేషన్ చేసినట్లు వివరించారట.

Traffic Records Before Marriage | ఓ తండ్రి చేసిన ఈ వినూత్న ప్రయత్నం

Traffic Records

ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. “ఇప్పటివరకు జీతం, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం మాత్రమే చూసేవారు.. ఇప్పుడు ట్రాఫిక్ హిస్టరీ (Traffic History) కూడా చెక్ చేసే రోజులు వచ్చేశాయేమో” అంటూ పలువురు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ తండ్రి ఆలోచనను ప్రశంసిస్తూ, బాధ్యతగల వ్యక్తి ప్రవర్తనను అంచనా వేయడానికి ఇలాంటి వివరాలు కూడా ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా, కూతురి భవిష్యత్తు కోసం ఓ తండ్రి చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విస్తృత చర్చకు దారితీస్తోంది. కుటుంబ నేపథ్యం మాత్రమే కాకుండా వ్యక్తిగత బాధ్యత, ప్రవర్తన కూడా జీవిత భాగస్వామి ఎంపికలో కీలకమనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..: Mobile Food Court | మొబైల్​ ఫుడ్​ కోర్టుగా పాత కారు.. యువత వినూత్న ఆలోచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *