అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travel Bus Fire | ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిద అయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District)లో చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.
ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. అందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం (Chityala Mandal) పెద్ద కాపర్తి గ్రామ సమీపంలోకి రాగానే బస్సులో మంటలు చేలరేగాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Travel Bus Fire | డ్రైవర్ స్పందించడంతో..

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తం అయ్యారు. బస్సును పక్కన నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానిక వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే బస్సుతో పాటు ప్రయాణికుల లగ్గేజీ పూర్తిగా కాలిపోయింది.
Travel Bus Fire | షార్ట్ సర్క్యూట్‌తో..

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ (Short Circuit)తో ప్రాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు కాలిపోవడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.
సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన


