Paddy Lorry Overturn | అన్నదాతకు తీరని కష్టాలు.. జల్దిపల్లి వద్ద వడ్ల లారీ బోల్తా

Srinivas Kolluri

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Paddy Lorry Overturn | రైతులకు ధాన్యం విక్రయ కష్టాలు ఇప్పట్లో తీరేటట్టుగా లేవు. నెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గిపోయిన వడ్లను ఎట్టకేలకు లారీలు ఎక్కించి రైస్​మిల్లులకు తరలిస్తుంటే..చాలా ప్రాంతాల్లో లారీలు బోల్తాపడి వడ్లు రోడ్ల పాలవుతున్నాయి.

Paddy Lorry Overturn | లింగంపేట మండలం జల్దిపల్లి..

Paddy Lorry Overturn

లింగంపేట్ మండలం (Lingampet Mandal) జల్దిపల్లి గ్రామం నుంచి వడ్ల లోడుతో వెళ్తున్న లారీ శుక్రవారం రాత్రి నల్లమడుగు పెద్ద తండా వద్ద బోల్తాపడింది. లారీలో సుమారు 800 బస్తాల ధాన్యం ఉండగా, ప్రమాదం కారణంగా అన్ని బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడికి చేరుకున్న రైతులు ఆరోపించారు. ప్రమాద సమయంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించి వేరే లారీ ఏర్పాటు చేసి, ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Paddy Lorry Overturn

ఇది కూడా చదవండి..: Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *