హైదరాబాద్Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

బీఆర్​ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్​లో అదుపులోకి తీసుకొని నాంపల్లి ఠాణాకు తరలించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balka Suman Arrest | బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్​లో నాంపల్లి పోలీసులు (Nampally Police) ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని ఇటీవల బాల్క సుమన్​ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కాంగ్రెస్​ నాయకులు నాంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఉదయం ఆయనను అరెస్ట్ చేయడానికి తెలంగాణ భవన్​కు వచ్చారు.

Balka Suman Arrest |ఉద్రిక్తత నడుమ..

బాల్క సుమన్​ అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) లోపల బాల్క సుమన్‌ ఉండగా.. బయట భారీగా పోలీసులు మోహరించారు. ఆయనను అరెస్ట్​ చేస్తారనే సమాచారంతో బీఆర్​ఎస్​ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు గో బ్యాక్‌ అంటూ బీఆర్ఎస్‌ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులతో బీఆర్ఎస్‌ కార్యకర్తల వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. విచారణలో భాగంగా తీసుకెళ్లేందుకు వచ్చామని ఏసీపీ ప్రవీణ్‌ తెలిపారు. ఎట్టకేలకు ఆయనను అరెస్ట్​ చేసి నాంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Balka Suman Arrest

Balka Suman Arrest | అసలు ఏం జరిగిందంటే..

బాల్క సుమన్​ ఇటీవల మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆస్తులు తగలబెట్టాలని, రైలు పట్టాలను కొసేయాలని వ్యాఖ్యలు చేశారు. ధర్నాలకు ప్రజలు రావడం లేదని, మిలిటెంట్​ యాక్టివిటీలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్​ నేతలు బాల్క సుమన్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేశారు.

Balka Suman Arrest

ఇది కూడా చదవండి..: Ande Sri Smruti Vanam | ‘అందెశ్రీ’ స్మృతి వనంపై పట్టింపు కరువు.. ఓట్ల కోసం పక్క రాష్ట్ర నేతల విగ్రహాల ఏర్పాటు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mock Parliament | కలెక్టరేట్​లో ఉత్సాహంగా ‘మాక్​ పార్లమెంట్​’

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Mock Parliament | ప్రజా పాలన –...

ISI Terror Modul | దిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. దావూద్, ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్

అక్షరటుడే వెబ్‌డెస్క్: ISI Terror Modul | దేశ రాజధాని దిల్లీతో...

Bhubaneswar Truck Accident | త్రుటిలో తప్పిన ప్రమాదం..కారును 600 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhubaneswar Truck Accident | ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో...

LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో...