Chandrababu Comments | రేవంత్​రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Comments | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి డీలిమిటేషన్​పై అవగాహన లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి, స్టాలిన్​ అవగాహన లేకుండా.. దక్షిణాదికి నష్టం అని ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు.

చంద్రబాబు రెండో రోజు తమిళనాడు ఎన్నికల (Tamilnadu Elections) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్​తో దక్షిణాదికి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీలిమిటేషన్ (Delimitation)​కు ఇదే మంచి ఫార్ములా అన్నారు. దక్షిణాదిలో జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం ఎలా జరుగుతుందో కాంగ్రెస్​, డీఎంకే చెప్పాలన్నారు.

Chandrababu Comments

Chandrababu Comments | మోదీ ఎవరికి తలొగ్గరు

కేంద్రంలో మోదీ (PM Modi) నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉందని చంద్రబాబు అన్నారు. ఆయన ఎవరికీ సరెండర్ కారన్నారు. మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. తమిళనాడు, ఆంధ్ర వేర్వేరు కాదని బాబు అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి తమకు తమిళనాడు (Tamilnadu)తో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. అప్పుడే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి..: Case on Ambati Rambabu | గుంటూరులో అంబటి రాంబాబుపై మరో కేసు.. నిరసన దీక్షపై పోలీసుల చర్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *