అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TGPSC PCB Jobs | నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) గుడ్‌న్యూస్ చెప్పింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Pollution Control Board)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీసీబీలో మొత్తం 20 అసిస్టెంట్ సైంటిస్టు గ్రేడ్–2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 2026 జులై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు. 2026 జులైలో దీని పరీక్ష ఉంటుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తారు. ఎంపికైన వారికి పే స్కేల్ రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు ఉంటుంది.

TGPSC PCB Jobs | అర్హతలు
కెమిస్ట్రీ సబ్జెక్ట్‌గా ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 20 ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరిలో 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటా కింద రెండు పోస్టులు ఉన్నాయి. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ కేటగిరిలకు ఒక్కో పోస్టు కేటాయించారు. ఎస్సీ 3, ఎస్టీలకు 3 జాబ్‌లు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Telangana Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

