Pawan Kalyan Die-Hard Fan | పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం ప్ర‌త్యేక పూజ‌లు.. ఆల‌యం మెట్ల‌న్ని మోకాళ్ల‌తో ఎక్కిన వీరాభిమాని

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan Die-Hard Fan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)  అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 21 మంగళవారం ఉదయం 9 గంటలకు మోపిదేవిలోని శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యం (Sri Subrahmanyeswara Swamy Temple)లో మృత్యుంజయ హోమం నిర్వహించిన‌ట్టు తెలుస్తుంది.

మ‌రోవైపు చాలా చోట్ల ప‌వ‌న్ అభిమానులు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఓ అభిమాని ప‌వన్ ఫొటోని చేతిలో ప‌ట్టుకొని మోకాళ్ల‌పై మెట్ల‌న్ని ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ అభిమానులు అంటే ఇలానే ఉంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan Die-Hard Fan | ప్ర‌ముఖులు ఆరా..

ఇటీవల పవన్ కల్యాణ్ అధికారులతో సమావేశంలో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షలు, ఎంఆర్ఐ స్కాన్ నివేదికల ఆధారంగా వైద్యులు శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి, శనివారం సాయంత్రం సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు కనీసం వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరమని, అనంతరం ఆయన సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని చెప్పారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని వైద్యులు సూచించినట్లు తెలిపారు.

Pawan Kalyan Die-Hard Fan

ఇక పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా నాయకులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) ఫోన్ ద్వారా పవన్ కల్యాణ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి పరామర్శించడం పట్ల పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం, ప్రోత్సాహం ఇవ్వడం తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని అందరూ చేస్తున్న ప్రార్థనలు తనకు మానసిక బలం ఇస్తున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Raaka Movie Music | పాన్ వరల్డ్ మూవీ ‘రాకా’పై ఒక్క‌సారిగా పెరిగిన అంచనాలు.. ఇంటర్నేషనల్ లెవల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్న టీం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *