RCB Fans Hooliganism | ఆర్సీబీ గెలుపుతో రోడ్లపై హంగామా.. హద్దులు మీరుతున్న అభిమానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RCB Fans Hooliganism | అభిమానం హద్దులు మీరుతోంది. నచ్చిన నాయకుడు, హీరో, క్రికెటర్​ కోసం కొందరు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆదివారం రాత్రి ఐపీఎల్​ ఫైనల్​లో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు అభిమానులు హంగామా చేవారు.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర రచ్చ ఆర్సీబీ ఫ్యాన్స్​ హల్ చల్ చేశారు. సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఆర్సీబీకి మద్దతుగా నినాదాలు చేశారు. కొందరైతే పిచ్చిపట్టినట్లు ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్లేవారిని అడ్డుకుంటూ ఇబ్బంది పెట్టారు. వాహనాలపై దాడులు చేశారు. భారీకేడ్లను పడేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కర్నూలులో సైతం ఆర్సీబీ అభిమానులు రోడ్ల మీద విధ్వంసం సృష్టించారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు.

RCB Fans Hooliganism | సంబంధం లేకపోయినా..

RCB Fans Hooliganism

ఆర్సీబీ గెలుపుతో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి పోటెత్తారు. ట్రాఫిక్​ను అడ్డుకున్నారు. ప్రయాణికులు, తోటి పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. తొక్కిసలాటలను నివారించడానికి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. స్థానికంగా సంబంధం లేని ఫ్రాంచైజీ జట్ల కోసం యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, నగరాన్ని ఎందుకు అస్తవ్యస్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. క్రికెట్​పై అభిమానం పేరుతో దాడులు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా సంబరాలు చేసుకోవాల్సిన యువత.. ఇలా రోడ్లపై హంగామా చేయడం ఆందోళన కలిగిస్తోంది.

RCB Fans Hooliganism | ఎందుకు ఇలా…

ఇటీవల పారిస్​లో పీఎస్​జీ జట్టు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి నిప్పంటించి, కార్లు, దుకాణాలు ధ్వంసం చేశారు. దేశం ఏదైనా.. అభిమానులు ఇలా చేయడం ఇటీవల పెరిగింది. తమ అభిమాన నాయకుడు గెలవగానే, తమ పార్టీ అధికారంలోకి రాగానే రోడ్లపైకి వచ్చి దాడులు చేయడం చేస్తున్నారు. ఇక సోషల్​ మీడియా (Social Media)లో అయితే నిత్యం ఫ్యాన్​ వార్​ నడుస్తూనే ఉంటుంది.
ఇందులో చాలా మంది యువత కుటుంబాలను పట్టించుకోకుండా అభిమానం పేరిట తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను రిస్క్​లో పెడుతున్నారు. సోషల్​ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. ఇలా దాడులు చేయడానికి మూక మనస్తత్వం కారణంగా తెలుస్తోంది. అందరు ఒక చోట చేరగానే.. తాము ఏదైనా చేయాలని, తమను ఎవరు పట్టుకోలేరని దాడులకు తెగబడుతున్నట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

RCB Fans Hooliganism | కఠిన చర్యలు అవసరం

RCB Fans Hooliganism

అభిమానం పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వారిపై, ప్రజలు ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. అలా అయితేనే మిగతా వారిలో మార్పు వస్తుంది. లేదంటే వచ్చే ఏడాది మరో జట్టు గెలుస్తుంది. అప్పుడు ఆ టీం ఫ్యాన్ మరింత హంగామా చేస్తారు. అనుమతులు లేకుండా రోడ్లపై సంబరాలు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి. దేశ నిర్మాణంలో కీలకంగా మారాల్సిన నేటి యువత ఇప్పటికే స్మార్ట్​ ఫోన్లకు బానిసలుగా మారారు. మద్యం, డ్రగ్స్​కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కులాల పేరిట, హీరోల పేరిట సోషల్​ మీడియాలో సమయం వృథా చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Youth Dies | అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *