అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Swayambhu Poster Release | నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న స్వయంభూ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ హీరో లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నిఖిల్ పక్కన హీరోయిన్లుగా సంయుక్త మీనన్, నభా నటేశ్ నటిస్తున్నారు. సోమవారం నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ హీరో లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు నిఖిల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Birthday Special Video కూడా విడుదల కానుంది.
Swayambhu Poster Release | భారీ అంచనాలు
స్వయంభూ చిత్రాన్ని (Swayambhu Movie) భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కార్తికేయా, కార్తికేయా–2 సినిమాలతో నిఖిల్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కార్తికేయా–2 హిందీలో భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో నిఖిల్ ఇమేజ్ పెరగడంతో తాజాగా స్వయంభూ సైతం భారీ హిట్ కొడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Naga Chaitanya | సమంతతో రిలేషన్ షిప్‌పై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన నాగ చైతన్య


