Kavitha Telangana Warning | ఆంధ్రా నేతల విగ్రహాలు పగలగొట్టి పార్సల్ చేస్తాం.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Telangana Warning | తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోమని  రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత కల్వకుంట్ల కవిత( K Kavitha) హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. “నేను మొండిదాన్ని. మేము మళ్లీ అధికారంలోకి రాగానే ఇక్కడ పెడుతున్న ఆంధ్రా నేతల విగ్రహాలను పగలగొట్టి అక్కడికే పార్సల్ చేస్తాం. మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి. ఇది ‘టీఆర్ఎస్ 2.0’ అని గుర్తుంచుకోండి” అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha Telangana Warning | ఆంధ్రా నేతల ఏజెంట్ చేతిలో తెలంగాణ సీఎం పీఠం..

గతంలో తెలంగాణ వాదానికి భయపడిన ఆంధ్రా నేతలు.. ఇప్పుడు ఇక్కడ తమ ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే విగ్రహాలు పెడుతూ డ్రామాలు ఆడుతున్నారని కవిత ఆరోపించారు. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి వంటి మేధావులపై ఆంధ్రా పోలీసులు వచ్చి ఎదురుదాడి చేస్తున్నారన్నారు.ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా ప్రజలను మా సొంతవాళ్లలా చూసుకుంటామని, కానీ తెలంగాణ నీటి హక్కుల్లో, ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. వంటావార్పు, సకల జనుల సమ్మె లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలతో క్రమశిక్షణగా ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఎంతోమంది త్యాగాలు చేసినా వారి కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

kavitha

Kavitha Telangana Warning | పవన్, లోకేష్‌లపై ఫైర్..

ఏపీ ఏర్పడి 13 ఏళ్లయినా కనీసం రాజధాని కట్టుకోలేకపోయారని కవిత ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా చెప్తుంటే, జగన్ మాత్రం ‘మావిగన్’ అంటూ వారిపై రాజకీయ బాంబు వేశారని.. ఇలా రాజధాని విషయంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. అక్కడ విఫలమై ఆంధ్రా ప్రజల దృష్టి మళ్లించడానికే (డైవర్షన్ పాలిటిక్స్) మహానాడులో తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ పిచ్చి వాగుడు వాగారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇక్కడ నవనిర్మాణ సభలు పెట్టేముందు, వానొస్తే తమ సెక్రటేరియట్‌లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలన్నారు. ఏపీ నేతలకు జబ్బు చేస్తే హైదరాబాద్ రావాల్సిందే కానీ, అక్కడ ఆసుపత్రులు కట్టడం లేదన్నారు. తెలంగాణలో ఎక్స్‌టెన్షన్ అవుతామంటున్న లోకేష్ బాబుకు.. ఇక్కడ ఓట్లు పడవనే గతంలో దుకాణం బంద్ చేసిన విషయం mర్చిపోయాpరా అని ప్రశ్నించారు. వ్యాపారాలు, షూటింగులు చేసుకుంటే రెడ్ కార్పెట్ పరుస్తాం కానీ, రాజకీయాల్లో వేలు పెడితే ఊరుకోమన్నారు.

kavitha.2

Kavitha Telangana Warning | కాంగ్రెస్ పాలనపై విమర్శలు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కేకే, పీకే కమిటీలతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మోసం చేస్తోందని కవిత విమర్శించారు. కోదండరాం లాంటి ఒకరిద్దరికి పదవులిస్తే సరిపోదని, ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా ఉద్యమకారులందరికీ ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ హక్కుల కోసం తాము ‘పాంచజన్యం’ అనే ఐదు అంశాల ఎజెండాతో ముందుకు సాగుతున్నామని, రైతులకు మేలు చేయడం, యువతకు ఉద్యోగాలతో పాటు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం, సామాజిక తెలంగాణను సాధించడమే తమ లక్ష్యమని కవిత వివరించారు. దీనిపై మేధావులు సలహాలు ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *