Yellareddy Development | ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Development | ఎమ్మెల్యే మదన్​మోహన్​ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మున్సిపల్​ వైస్​ ఛైర్​పర్సన్​ మత్తమాల భాగ్యవతి తెలిపారు. పట్టణంలోని ఏడో వార్డులో ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

Yellareddy Development

Yellareddy Development | నిధులు మంజూరు

ఆమె మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) సహకారంతో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ పట్టణ కేంద్రంలోని సమస్యలను తెలియజేయగానే వెంటనే స్పందించి నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు. రూ.1.74 కోట్ల నిధులతో ఏడో వార్డులో సీసీ రోడ్డును పనులు ప్రారంభించామన్నారు.

 

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు గాదె తిరుపతి, సయ్యద్ గఫర్, రఫిక్, తమ్మల గాయత్రి, శ్యామ్, కో ఆప్షన్ మెంబర్లు పప్పు వెంకటేశం, అరుణ, కాంగ్రెస్ నాయకులు ప్యాలాల రాములు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి..: Pre Primary Classes | ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *