నిజామాబాద్CCTV security | సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రత : సీపీ సాయిచైతన్య

CCTV security | సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రత : సీపీ సాయిచైతన్య

గ్రామాలకు సీసీ కెమెరాలతో భద్రత ఉంటుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ‘అరైవ్ అలైవ్ – 2026’ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు, సర్పంచ్​లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CCTV security | ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని.. గ్రామాలకు సీసీ కెమెరాలతో (village security) భద్రత ఉంటుందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ‘అరైవ్ అలైవ్ – 2026’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ, సైబర్​క్రైం (cyber crime) ప్రివెన్షన్, డ్రగ్స్ నియంత్రణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లపై సర్పంచ్​లు, కౌన్సిలర్లకు బోధన్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

CCTV security | మన ఊరు.. మన భద్రత.. మన బాధ్యత..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ఫిన్లాండ్ అని అన్నారు. వ్యవసాయదారులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూసుకోవాలన్నారు. యువత డ్రగ్స్​కు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉండాలని, ఆన్​లైన్​ బెట్టింగ్​కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు.

CCTV security | అధిక వేగంతో అన్నీ అనర్థాలే..

అధిక వేగం, క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తాయని సీపీ వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ, కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియమాలు పాటించడం (traffic rules) ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్–1, ఫేస్–2లో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 200 మంది మృతి చెందారని.. అదే 2025లో రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 302 మంది మృతి చెందారని వివరించారు.

కార్యక్రమంలో బోధన్​ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైం ఏసీపీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఇలియాస్, బోధన్ టౌన్ ఎస్​హెచ్​వో వెంకటనారాయణ, బోధన్ రూరల్​ సీఐ విజయ్​ బాబు, రుద్రూర్ సీఐ శ్రీకృష్ణ, బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, ఎన్ఎస్​సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబశివరావు, ఎన్​ఎస్​ఈ మెంబర్స్ దుష్యంత్, కొడాలి కిషోర్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్, బోధన్ టౌన్ ఎస్సై మనోజ్, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునీల్, సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

 cpcp

cp33

ఇది కూడా చదవండి: Arvind Comments on KCR | కేసీఆర్​ శకం ముగిసింది..: ఎంపీ అర్వింద్​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...