అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Truck Drivers Arrested | అమెరికా (America)లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను తాజాగా అరెస్ట్ చేశారు.
దేశంలో అక్రమంగా నివసిస్తున్నందుకు 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. సోమవారం యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మే 11-15 తేదీల మధ్య అరిజోనాలోని యూమా సెక్టార్ ఏజెంట్లు అరెస్టు చేసిన 52 మందిలో ఈ భారతీయులు (Indians) కూడా ఉన్నారు. వీరందరినీ దేశ బహిష్కరణకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 52 మందిని అరెస్టు చేయగా, వారిలో 36 మంది సెమీ-ట్రక్కులు నడిపారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, ముగ్గురి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం గమనార్హం.
Indian Truck Drivers Arrested | స్వదేశానికి పంపేందుకు చర్యలు
అరెస్ట్ అయిన వారిలో 30 మంది భారతదేశానికి చెందినవారు కాగా, ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందినవారు ఉన్నారు. వీరందరిపై ఫెడరల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, దేశ బహిష్కరణ విధించారు. వీరిని త్వరలో స్వదేశాలకు పంపనున్నారు. కాగా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వాణిజ్య మోటారు వాహన ఆపరేటర్లను గుర్తించి, అరెస్టు చేసేందుకు అమెరికా అధికారులు ‘ఆపరేషన్ చెక్‌మేట్’ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: US Shooting Incident | అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి


