నిజామాబాద్GGH Nizamabad | రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలి

GGH Nizamabad | రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలి

ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆస్పత్రి నిబంధనలు పాటించాలని నిజామాబాద్​ మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్​ కృష్ణ మోహన్​ సూచించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: GGH Nizamabad | ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆస్పత్రి నిబంధనలు, విధులు, వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్​ మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్​ కృష్ణ మోహన్​ సూచించారు. నిజామాబాద్​ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన ఇంటర్న్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని సూచించారు.

GGH Nizamabad | వివిధ అంశాలపై అవగాహన

జీజీహెచ్​ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్​ నాగ మోహన్ మాట్లాడుతూ ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్​ శ్రీకాంత్, డా. రవికిరణ్, డా. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. వైస్ ప్రిన్సిపాళ్లు డా. కె.జె.కిషోర్ కుమార్, డా. జె.తిరుపతి రావు, డా. విజయ్ కుమార్, డా. అరుణ రేఖ, డా. సలీం, డా. రమణ, డా. ఇమ్రాన్, డా. శివకృష్ణ తమ తమ విభాగాల్లో ఇంటర్న్‌ల విధులు, బాధ్యతలు, రోగుల సంరక్షణ విధానం, అత్యవసర సేవలు, మెడికో-లీగల్ అంశాలు, వైద్య నైతిక విలువలు, ఆస్పత్రి సేవా ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...