నిజామాబాద్Fire Accident | పైపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Fire Accident | పైపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి : Fire Accident | ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన భిక్కనూరు (Bhikkanoor) మండలం జంగంపల్లి శివారులోని హరిహర పాలిమర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

బాధితుల కథనం ప్రకారం.. జంగంపల్లి గ్రామం నుంచి దోమకొండ (Domakonda) వెళ్లే దారిలో హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీ ఉంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. వేసవికాలం కావడంతో ఎండ తాకిడికి మంటలు దట్టంగా వ్యాపించాయి. దాంతో ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రి కాలి బూడిదైంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

jangampalli

Fire Accident | పోలీసుల దర్యాప్తు

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారీ అగ్ని ప్రమాదంతో సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్టు బాధితులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

fire

దీనిని కూడా చదవండి : Employee Health Cards | హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...